కమలానికి అదే పెద్ద మైనస్? సెట్ చేయగలరా?

-

తెలంగాణలో నెక్స్ట్ ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ బాగానే హడావిడి చేస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తామే పోటీ ఇవ్వగలుగుతామని చెబుతోంది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, హుజూరాబాద్‌లో కూడా గెలిచి టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని అనుకుంటుంది.

కానీ హుజూరాబాద్‌లో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటగలదా? అంటే కాస్త కష్టమనే చెప్పొచ్చు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం ఈటల రాజేందర్ బలం మీద ఆధారపడి ఉంది. అలాగే దుబ్బాక, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, నాగార్జున సాగర్‌లో డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో అడ్రెస్ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది.

ఈ పరిణామాలని బట్టి చూస్తే బీజేపీకి రాష్ట్ర స్థాయిలో పూర్తి బలం లేదని చెప్పొచ్చు. 119 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు మాదిరిగా బీజేపీకి బలమైన నాయకులు లేరు, క్యాడర్ లేదు. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన నేతలు ఉండటమే బీజేపీకి అడ్వాంటేజ్. అయితే వచ్చే ఎన్నికల్లో ఇదే అంశం బీజేపీకి అతి పెద్ద మైనస్ కానుంది. ఇప్పటినుంచే రాష్ట్రంలో అన్నీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులని పెట్టుకోవాల్సిన అవసముంది. క్యాడర్‌ని కూడా బలోపేతం చేసుకోవాలి.

వచ్చే ఎన్నికల్లోపు ఇదంతా జరగాలి. లేదంటే బీజేపీకి గెలిచే అవకాశం ఉండదు. అసలు గత ఎన్నికల్లోనే బీజేపీ 100కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. మరి ఈ పరిస్తితిని బీజేపీ ఇప్పుడు పూర్తిగా చక్కదిద్దుకున్నట్లు కనిపించడం లేదు. ఇంకా చాలా నియోజకవర్గాల్లో బీజేపీ జెండా కూడా కనిపించడం లేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్…ఈ పరిస్తితిని మార్చాలి. లేదంటే బీజేపీకి మళ్ళీ డిపాజిట్లు రావడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news