విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెట్లనర్సంపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పసుల స్వామి, రేణుక దంపతుల కుమారుడు వినయ్ (12) భారీగా ఈదురుగాలలు, వర్షంతో విద్యుత్ స్తంభం నుంచి ఇంట్లోకి వచ్చే వైరు తేగిపడింది. దురుదృష్టవశాత్తు తెగిన సర్వీస్ వైర్ పై కాలుపెట్టిన బాలుడు కరెంట్ షాక్ కు గురయ్యాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదిలా ఉంటే.. పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జమ్మికుంట మండల పరిధిలోని నాగంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ కొమరయ్య (47) పదేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నాగంపేట గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత ఇనుప సామాను దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్న కొమురయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు గురవడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు నరేందర్, కూతుళ్లు మౌనిక, స్పందన ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొమురయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ చిన్నికృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.