ఐపీఎల్ 2023: రాణించిన గైక్వాడ్ 60… చెన్నై 172

-

ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ 1 లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఆడినంతగా సెకండ్ హాఫ్ లో ఆడలేదని చెప్పాలి. ఓపెనర్లు మొదటి వికెట్ కు 87 పరుగులు జోడించి చెన్నై కు శుభారంభాన్ని అందించారు. ఋతురాజ్ గైక్వాడ్ వికెట్ తర్వాత ఇన్నింగ్స్ బాగా నెమ్మదించింది. ముఖ్యంగా మరో ఓపెనర్ కాన్ వే షాట్ లు ఆడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇతను కనుక తన ఫామ్ ప్రకారం ఆడి ఉంటే చెన్నై మరిన్ని పరుగులు సాధించి ఉండేది. చివరికి కాన్ వే 40 పరుగులకే పరిమితం అయ్యి షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దుబే మరియు రహానే లు కూడా తమ బ్యాట్ ను జులిపించడంలో ఫెయిల్ అయ్యారు.

ఆ తర్వాత ఇబ్బంది పడుతూ ఆడిన చెన్నై గౌరవప్రదమైన స్కోర్ 172 ను సాధించింది. మరి ఈ టార్గెట్ ను చెన్నై కాపాడుకుని గుజరాత్ ను కట్టడి చేసి ఫైనల్ కు చేరుతుందా లేదా చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news