ఏపీ : బాలికను గర్భవతిని చేసిన బాలుడు అరెస్ట్..!

రోజురోజుకు లైంగిక దాడులు పెరుగుతున్నాయి. మహిళల రక్షణ కోసం కొత్త చట్టాలు తీసుకు వచ్చినా నిందితులను కఠినంగా శిక్షించినా మానవ మృగాలలో మార్పులు రావడం లేదు. రీసెంట్ గా ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలంలో తొమ్మిదో తరగతి బాలికను 17 ఏళ్ల బాలుడు గర్భవతిని చేశాడు. బాలిక తొమ్మిదో తరగతి చదువుకుని ఇంటివద్దే కాలీగా ఉంటుంది.

Rape on 11years boy at pakistan
Rape

బాలుడు ఇంటర్ పూర్తి చేయగా ఆ బాలికతో పరిచయం పెంచుకుని మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఈ క్రమంలో బాలిక ఆరోగ్యం క్షీణించింది. అనుమానం వచ్చిన తల్లి తండ్రులు బాలికను నర్సీపట్నం లోని ఓ ఆస్పత్రికి తరలించగా గర్భవతి అని తెలిసింది. దాంతో బాలిక తల్లి తండ్రులు బాలుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్ట్ చేశారు.