ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది జగన్ సర్కార్. పెరిగిన డీఏను 2022 జనవరి నుంచి జీతంతో కలిపి ఇవ్వనుంది ప్రభుత్వం.

డీఏ బకాయిలను 2022 జనవరి నుంచి మూడు విడతలుగా చెల్లించనున్న ప్రభుత్వం… జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. డీఏ లో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు అలాగే మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. జెడ్పీ, మండల పరిషత్తులు, గ్రామ పంచాయితీలు, అన్ని ఎయిడెడ్ సంస్థలు విశ్వ విద్యాలయాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది ఆర్ధిక శాఖ.