పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతుకోసి చంపాడు ప్రియుడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామంనుండి 25 ఏళ్ల క్రితం వచ్చి, సంగారెడ్డి జిల్లా బండ్లగూడలో నివసిస్తున్నారు బొత్స శ్రీనివాస రావు, ఈశ్వరమ్మ దంపతులు. చందానగర్ లోని ప్రగతి కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు వారి కూతురు రమ్య(23).
గత మూడేళ్లుగా మెదక్ జిల్లా మన్నేపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నాడు రమ్య. సోమవారం రమ్య ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి, తన ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడు ప్రవీణ్. చదువు పూర్తయ్యాకే పెళ్లి గురించి ఆలోచిద్దామని చెప్పడంతో, ముందుగానే తనతో తెచ్చుకున్న కత్తితో రమ్య గొంతు కోసి కిరాతకంగా హత్య చేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ప్రవీణ్.
అదేసమయంలో ఇంటికొచ్చిన తల్లిదండ్రులు రక్తపు మడుగుల్లో ఉన్న వారిద్దరిని గమనించగా, అప్పటికే మరణించింది రమ్య. కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.