ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ‘బరాదర్’

-

అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో అఫ్ఘానిస్థాన్‌ ముఖ్యమంత్రి అధ్యక్ష భవనాన్ని వదిలి పాకిస్థాన్‌ పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే… అష్రఫ్‌ ఘనీ ఎక్కడ ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామంటూ తాటిబన్‌ ప్రతి నిధులు ప్రకటన కూడా జారీ చేశారు. ఆఫ్ఘన్‌ లో ఇక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. తమ అధ్యక్షుడిగా బరాదర్‌ వ్యవహరిస్తామని ప్రకటించారు.

తాలిబన్ల రాజ్యం ఏర్పడటంతో వివిధ దేశాలు రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. తమ సిబ్బందిని తీసుకు రావడానికి మూడు వేల మంది అదనపు బలగాలను పంపించింది అమెరికా. ఇక భారత్‌ కూడా భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. నిన్న మధ్యాహ్నం 12.45 కు ఢిల్లీ నుంచి బయలు దేరిన విమానం.. 129 మంది ప్రయాణికులతో సాయంత్రం 5.35 భారత్‌ కు బయలు దేరింది.  ఇక అటు కాబూల్‌ లో తాలిబన్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. రవాణా పై ఆంక్షలు విధిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news