కాబుల్ ఎయిర్‌స్పేస్ క్లోజ్… ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళలేదు..!

-

తాలిబన్ల వల్ల మరో కొత్త సమస్య వచ్చింది. ఆఫ్గాన్ ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గాన్ నుంచి బయట పడేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. కానీ అక్కడి నుండి బయట పడటానికి మార్గం ఏమీ కనబడడం లేదు. అటు భారత అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను పంపించనున్నారు.

దీని కారణంగా ఎయిర్పోర్ట్ అంతా కూడా జనంతో నిండిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ దేశ ఎయిర్ స్పేస్ ని మూసి వేసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ నుండి ప్రజలు కదల్లేని పరిస్థితి వచ్చింది. ఆఫ్గాన్ గగనతలంని మూసి వేసినట్లు విమానయాన సంస్థలకు నోటీసు వచ్చింది. దీంతో ఎయిరిండియా వర్గాలు అక్కడికి విమానాలని పంపలేక పోతున్నామని చెప్పారు.

అమెరికా నుండి ఢిల్లీ వచ్చే విమానాలు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్తాయి. అయితే అమెరికా నుండి ఢిల్లీకి వచ్చే విమానాలను ఆఫ్గాన్ మీదగా వెళ్లకుండా రూట్ ని మారుస్తున్నారు. అయితే ఆ విమానాలు దోహా లేదా యూఏఈలో ఫ్యూయల్ ని నింపుకుని ఢిల్లీకి రానున్నాయి. అయితే ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు కాబుల్ కి విమానాన్ని పంపుతున్నాము అని కూడా చెప్పారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే అలా జరగడం లేదు అని ఎయిర్ ఇండియా అంది. చికాగో నుండి ఢిల్లీకి వస్తున్న విమానాల్ని గల్ఫ్ మీదగా దారి మళ్లించారు అని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే అమెరికా సహా పలు దేశాలు విమానాలు తమ పౌరుల కోసం కాబూల్ విమానాశ్రయంలో ఉన్నాయి. కానీ కొత్త నిర్ణయం తీసుకోవడంతో అవన్నీ అక్కడే చిక్కుకుపోయిన పరిస్థితి వచ్చింది. హమీద్ కర్జాయ్ విమానాశ్రయంకి దయచేసి విమానాశ్రయానికి వెళ్లవద్దు అని కాబూల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news