“బ్రహ్మాస్త్రం” మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

-

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌలి ప్రజెంట్ చేయడంతో పాటు విడుదల చేస్తు్న్నారు. ‘బ్రహ్మాస్త్రం’ టైటిల్ తో విడుదల కానున్న ఈ పిక్చర్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది.

తొలి భాగం..‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో సర్ ప్రైజెస్ కూడా ఉన్నాయని మేకర్స్ చెప్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా మూవీ మేకింగ్ వీడియో ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

https://www.instagram.com/reel/CiE__06gf3-/?utm_source=ig_embed&ig_rid=3c31c92c-a58b-449e-a2c1-98f8dd612e93

Read more RELATED
Recommended to you

Latest news