బ్రేక్‌ ద చైన్‌ ఉద్యమం మొదలుపెట్టాలి

-

కరోనా కేసులను తగ్గ్గించేందుకు బ్రేక్‌ ద చైన్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టాలని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు. ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలను పెంచుకుంటూనే కేసులను తగ్గించుకోవాల్సి ఉందని సూచించారు. కోవిడ్ చికిత్స గురించి కూడా ఆయన మాట్లాడారు. కొవిడ్‌లో రెండు దశలున్నాయన్న ఆయన… ఏ దశలో వాడాల్సిన మందులు ఆ దశలోనే వాడాలని అన్నారు.

మొదటి దశలో దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలకు ఉంటాయని వీటికి అనుగుణంగా ఇచ్చే చికిత్సతో చాలా మంది కోలుకుంటారని అన్నారు. అయితే కొంతమందిలో కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లో ఎక్కువ వ్యాప్తి చెందుతుందని వారిని రెండో దశ రోగులుగా గుర్తించాలని అన్నారు. వారిని ఆసుపత్రుల్లో చేర్పించి రెమ్‌డెసివిర్, ప్లాస్మా లాంటివి ఇస్తుంటారని అన్నారు. అయితే కొందరిలో రెండో దశలో వైరస్‌ లోడు ఎక్కువగా లేనప్పుటికీ రోగ నిరోధకశక్తిపై తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. ఇలాంటి వారికి స్టెరాయిడ్స్, ఇతర మందులు ఇవాల్సి ఉంటుందని అన్నారు. కావున ఏ దశలో ఎలాంటి చికిత్స అందించాలన్న విషయమై గ్రామీణ వైద్యులకు మార్గదర్శకాలు పంపుతున్నట్లు ఆయన చెప్పారు.

ఇక కరోనా టీకా రెండో డోసుపై ఆయన మాట్లాడారు. రెండో డోసు ఆలస్యమైనా కంగారు వద్దని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు రెండు వారాల తర్వాతే వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయని అయితే 4-6 వారాల్లో కూడా తీసుకోవచ్చని చాలా మంది వైద్యులు చెబుతున్నారని అన్నారు. అయితే రెండో డోసు కొన్ని వారాలు ఆలస్యమైతే వ్యాక్సిన్‌ పనిచేయదని అపోహ వద్దని… రెండో డోసు ఆలస్యమైనా బూస్టర్‌ ఎఫెక్ట్‌ ఇస్తుందని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news