పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎంపీల సస్పెన్షన్ తీర్మానానికి రాజ్యసభ డిప్యూటి చైర్మన్ వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు నిన్న తీవ్ర్ స్థాయిలో ఆందోళన చేసాయి. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలకు చెందిన ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం వివాదాస్పదంగా మారింది. ఈ సందర్భంగా బిల్లు ప్రతులను ఎంపీలు చించి వేసారు.
దీనితో ఈ సెషన్ పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు నిన్న నిరసన తెలిపి హడావుడి చేసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల తీరుపై వెంకయ్య సభలోనే ఆగ్రహం వ్యక్తం చేసారు. బిజెపి ఎంపీలు ఈ తీర్మానం ప్రవేశ పెట్టగ దానికి చైర్మన్ ఆమోద ముద్ర వేసారు. నిన్న వ్యవసాయ బిల్లులను రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే.