రెండో సెరో సర్వే పూర్తి చేసాం: త్వరలోనే వివరాలు ఇస్తాం…!

కరోనా వైరస్ కోసం దేశవ్యాప్తంగా రెండవ సెరోసర్వే విజయవంతంగా పూర్తయిందని, సర్వే యొక్క చివరి దశ విశ్లేషణ ఇప్పుడు జరుగుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఆదివారం ఒక ప్రకటన చేసింది. కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా కనిపించే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని కంటైనేషన్ జోన్లు సూచిస్తాయని ఐసిఎంఆర్ తెలిపింది.

అవి జాతీయంగా కరోనా వైరస్ ని అంచనా వేయడానికి సరిపోవు అని పేర్కొంది. ఐసిఎంఆర్ ఆయా రాష్ట్ర అధికారులతో నిరంతరం కమ్యూనికేట్ చేస్తోందని చెప్పింది. డైనమిక్ కంటైనేషన్ జోన్ల నుండి మునుపటి సర్వే ఫలితాలు ఇచ్చామని… తదుపరి చర్యలను రాష్ట్రాలకు సూచించామని చెప్పింది. సెప్టెంబర్ 11 న ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన మొదటి జాతీయ సెరోసర్వే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 69.4% మంది కరోనా బారిన పడినట్లు వివరించింది.