BREAKING: కామన్ వెల్త్ లో భరత్ కు మరో గోల్డ్ మెడల్

-

కామన్వెల్త్ గేమ్స్ – 2022 లో భారత్ మరో గోల్డ్ మెడల్ గెల్చుకుంది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ లో భారత వెయిట్ లిఫ్టర్ జెరేమి లాల్రిన్నుంగా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 67 కేజీల విభాగంలో ఈ 19 ఏళ్ల కుర్రాడు రికార్డు సృష్టిస్తూ బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నాడు. క్లీన్ అండ్ జర్క్ లో మొదటి ప్రయత్నంలో 154 కేజీలు ఎత్తిన లిఫ్టర్.. తన రెండవ ప్రయోగంలో 160 కేజీలు ఎత్తాడు.

దీంతో మొత్తంగా 300 కేజీలకు పైగా ఎత్తి ఓవరాల్ గా రికార్డు సృష్టించాడు. బర్మింగ్ హమ్ లో జరుగుతున్న క్రీడా ఈవెంట్ లో ఇది భారతదేశానికి రెండవ స్వర్ణం. కామన్వెల్త్ గేమ్స్ లో ఇప్పటివరకు భారత్ కి మొత్తం ఐదు పథకాలు వచ్చాయి. ఇందులో రెండు గోల్డ్ మెడల్స్ కాగా రెండు సిల్వర్, ఒకటి బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ లోనే భారత్ కు 5 మెడల్స్ వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news