బ్రేకింగ్: అంతర్జాతీయ విమానాలకు మరో షాక్

-

మన దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చే విమానాలకు, ఇక్కడి నుంచి వెళ్ళే విమానాలకు అనేక ఆంక్షలను అమలు చేస్తుంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున, షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను అక్టోబర్ 31 వరకు నిలిపివేస్తున్నట్లు భారత ఏవియేషన్ రెగ్యులేటర్ డిజిసిఎ బుధవారం ప్రకటించింది.

“అయితే, ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలను పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వం అనుమతిస్తుంది. కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇది ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు పేర్కొన్నారు. కరోనా మన దేశంలోకి వచ్చిన మార్చ్ నెల నుంచి విమానాలపై ఆంక్షలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news