ఇప్పుడు ప్రజలు లాక్ డౌన్ ని చాలా లైట్ తీసుకున్నారు. అసలు లాక్ డౌన్ లాంటి సంచలన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటారు అనేది కూడా జనాలకు కనీస అవగాహన లేకుండా పోయింది. బయటకు వస్తే కరోనా వైరస్ కమ్మేస్తుంది అని చెప్పినా సరే జనాలు మాత్రం ఎవరి మాట వినడం లేదు. పోలీసులు కొట్టినా వినడం లేదు, దండం పెట్టి చెప్పినా వినడం లేదు. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పినా వినడం లేదు.
దీనితో ఇప్పుడు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలు మాట వినకుండా బయటకు వస్తే మాత్రం ఇప్పుడు ఇక సహించేది లేదు అని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పారామిలటరీ బలగాలను దింపడానికి కేంద్రం సిద్దమైంది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బయటకు వస్తున్న నగరాల్లో, గ్రామాల్లో పారామిలటరీ బలగాలను దించడానికి కేంద్రం సిద్దమైంది.
ఇప్పటికే సిఎం జగన్, కెసిఆర్ కి సమాచారం పంపినట్టు సమాచారం. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బలగాలను దింపనున్నారు. కేంద్ర హోం శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బయటకు వస్తే మాత్రం ఇక నుంచి కచ్చితంగా అరెస్ట్ చేసి వారిని జైలుకి కూడా పంపాలని సెంట్రల్ జైలు కి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. సరైన కారణం లేకపోతే మాత్రం ఇక క్షమించేది లేదని భావిస్తున్నారు.