ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలనా రాజధాని అమరావతికి ఈ నెల 16 న శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదించిన నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ లో షాక్ తగిలింది. రైతులు వేసిన పిటీషన్ ని విచారించిన హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టే ని సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది.
ప్రభుత్వం సుప్రీం లో స్పెషల్ లీవ్ పిటీషన్ ని దాఖలు చేసింది. ముందుగా ఏపీ సర్కార్ ఈ నెల 16 న కచ్చితంగా పరిపాలనా రాజధాని విశాఖకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది. అందుకే దీనిపై ముందు జాగ్రత్తగా సుప్రీం కోర్ట్ కి వెళ్ళింది ఏపీ సర్కార్. దీనితో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై ఇప్పుడు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. మరి సుప్రీం కోర్ట్ ఏ విధంగా తీర్పు ఇస్తుంది అనేది చూడాలి.