ప్రస్తుత సమాజంలో ఆడ, మగ ఇద్దరూ సమానంగా రాణిస్తున్నారు. కొన్ని రంగాల్లో మగవారి కంటే ఆడవారే ముందున్నారు. సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ఆడపిల్ల పుట్టడమే పాపం గా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందంటేనే వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తీవ్ర వేధింపులకు గురిచేసి మోప్పు తిప్పలు పెడుతున్నారు. కొన్నిసార్లు హత్యలు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా ఆడపిల్ల పుట్టిందని బాలికను నేలకేసి కొట్టాడు ఓ తండ్రి.
అతనికి కూతురు పుట్టినప్పటినుండే తన కూతురిపై ద్వేషం పెంచుకున్నాడు. ఇటీవల ఇంట్లోని బాత్రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సకినా ఫాతిమాను నెలకేసి కొట్టాడు ఆ కిరాతక తండ్రి. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది చిన్నారి. దీంతో తల్లి సనా ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కసాయి తండ్రి భాసిత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు సైఫాబాద్ పోలీసులు.