జీవితాంతం వైసీపీలోనే.. ఊసరవెల్లి రాజకీయాలు చేతకాదు : బాలినేని

ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘మై హ్యాండ్‌లూమ్‌.. మై ప్రైడ్‌’ చాలెంజ్‌లో జనసేనాని పవన్‌ కల్యాణ్.. వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చాలెంజ్‌ను విసిరారు. అయితే.. పవన్‌ చాలెంజ్‌ను స్వీకరించిన బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి చేనేత దుస్తులు ధరించి ఫోటోలో పెట్టారు. అయితే.. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది వ్యక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి ఘటనలు బాధాకరమని తెలిపారు బాలినేని. తనకు ఊసరవెల్లి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని స్పష్టం చేశారు బాలినేని.

Balineni welcomes CM's plan to replace entire cabinet

చేనేతల కుటుంబానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని.. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ కు రెస్పాండ్ అయ్యానని అన్నారు బాలినేని. ఇటీవల కాలంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి సీఎం జగన్‌తో మాట్లాడతానని తెలిపారు బాలినేని. గోరంట్ల మాధవ్  విషయంలో విచారణ చేపట్టడం జరుగుతుందని తదనగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నేతల మధ్య ఏర్పడిన విభేదాలు సమసిపోయాయని తెలిపారు బాలినేని.