తెలంగాణా బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో గందరగోళం సృష్టిస్తున్న అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసారు. ఒక రోజు పాటు వీరి సస్పెండ్ చెయ్యాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించిన నేపధ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, జయప్రకాష్ రెడ్డి, పోడెం వీరయ్య, మల్లు బట్టి విక్రమార్కను సస్పెండ్ చేసారు.
ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసారు. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కెసిఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గవర్నర్ ప్రసంగానికి కెసిఆర్ ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో వారు ఈ వ్యాఖ్యలు చేసారు. గొంతు చించుకోవద్దు మేము వంద మందిమి ఉన్నాం అంటూ కెసిఆర్ హెచ్చరించారు. అయితే వారు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్ ద్వారా బయటకు పంపించారు.