టీడీపీకి గల్లా ఫ్యామిలీ షాక్…!

-

ఆంధ్రప్రదేశ్ లో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు సైలెంట్ గా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. రాజకీయంగా ఒకప్పుడు బలంగా ఉండి, ప్రభుత్వంలో కూడా మంత్రులుగా పని చేసిన వారు సైలెంట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా కొందరు అసలు కనపడటం లేదు. అసలు ఎం జరుగుతుందో అర్ధం కావడం లేదు.

కార్యకర్తలు కొందరు పార్టీ విషయంలో ఎన్నో ఆశాలుపెట్టుకున్నారు. ఇప్పుడు బలపడుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినా సరే ఇది సాధ్యం కావడం లేదు. అసలు నేతలు దూకుడుగా ఉండాల్సిన సమయంలో ఎందుకు సైలెంట్ అవుతున్నారో అర్ధం కావడం లేదు. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణ కుమారి సైలెంట్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆమె మాట కూడా మాట్లాడటం లేదు.

1999, 2004, 2009 లో ఆమె హ్యాట్రిక్ విజయాలు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నమోదు చేసారు. అప్పట్లో ఆర్కే రోజాకు ఆమె చుక్కలు చూపించారు. మరి ఏమైందో ఏమో తెలియదు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కూడా పని చేసారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం చేసారు, చంద్రగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

ఇక ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా అప్పుడు పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. కాని ఆమె మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి తో ఆమెకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో వీళ్ళు చక్రం తిప్పారు.

ఇప్పుడు జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి కూడా కీలక నేతగా ఉండేవారు. దీనితో గల్లా అరుణ వైసీపీ లో చేరాలని చూస్తున్నా గల్లా జయదేవ్ టీడీపీని వీడే అవకాశం కనపడటం లేదు. ఆమె వైసీపీలోకి వెళ్తే ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు గల్లా. తల్లి ఒక పార్టీలో కొడుకు ఒక పార్టీలో ఉంటే పద్ధతి కాదని కొందరు అంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వకుండా పులివర్తి నానీకి చంద్రగిరి నుంచి అవకాశం ఇచ్చారు. దీనితోనే ఆమె సైలెంట్ అయ్యారు అనే వాదన కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news