బ్రేకింగ్; ఆడాళ్ళను మగ పోలీసులు ఎందుకు కొట్టారని ప్రశ్నించిన హైకోర్ట్…!

-

ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రాష్ట్ర హైకోర్ట్ షాక్ ఇచ్చింది. అసలు అమరావతిలో 144 సెక్షన్ ఎందుకు విధించారని నిలదీసింది. వివరాల్లోకి వెళితే ఇటీవల అమరావతిలో జరిగిన పరిణామాలపై రాష్ట్ర హైకోర్ట్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం కనకదుర్గమ్మకు సారే ఇవ్వడానికి వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా లాఠీ చార్జ్ కూడా జరిగింది.

ఆ తర్వాత కొంత మందిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఇక ఈ నేపధ్యంలోనే మహిళలపై పోలీసులు దాడులకు కూడా దిగారు. మగ పోలీసులు కొంత మంది మహిళలపై దాడులు చేసారు. దానికి తోడు రాజధాని గ్రామాల్లో అత్యవర పరిస్థితిని విధించారు. దీనిపై హైకోర్ట్ సీరియస్ అయింది. పత్రికల్లో వచ్చిన కొన్ని ఫోటోలను కధనాలను రాష్ట్ర హైకోర్ట్ స్వయంగా సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ నేపధ్యంలో ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ ముగియగా సుమారు గంటపాటు ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. 2014 నుంచి అక్కడ 144 సెక్షన్ అమలులో ఉందని తాము పొడిగించామని వివరించారు. జైలు భరో అసెంబ్లీ ముట్టడి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తే అడ్డుకుంటామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అంగీకరించేది లేదని చెప్పారు.

ప్రజలు శాంతియుతంగా నిరసన తెలియజేయవచ్చు అన్నారు. ముందస్తు అఫిడవిట్ కోసం సమయం కోరారు, ఈ సందర్భంగా చీఫ్ జస్టీస్ మహిళల పట్ల వ్యవహరించిన తీరుని ప్రశ్నించారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలను ఏ విధంగా ఐడి కార్డులు అడిగారు, 610 మంది రైతులను ఎందుకు అరెస్ట్ చేసారని ప్రశ్నించగా, ట్రాఫిక్ నిభందనలు ఉల్లఘించారని రాష్ట్ర ప్రభుత్వ లాయర్ వివరణ ఇచ్చారు.

మహిళలను బూటు కాలితో ఎందుకు తన్నారని హైకోర్ట్ నిలదీసింది. అత్యవసర పరిస్థితి ఉంటే మినహా 144 సెక్షన్ విధించకూడదు అని చెప్పింది. రాజధాని వీధుల్లో ఎందుకు మార్చ్ చేసారని ప్రశ్నించింది హైకోర్ట్. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని చెప్పగా మరి ఎందుకు సెక్షన్ 144 విధించారని, పోలీసులు ఎందుకు మొహరించారని ప్రశ్నించింది. ముందస్తు అల్లర్లు జరగకుండా అని సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news