బ్రేకింగ్; ప్లాంట్ మూసేసిన కియా, ఉద్యోగులను పంపించేస్తుంది…!

-

దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ తన కార్ల తయారి సంస్థ ఉల్సాన్ కాంప్లెక్స్ లో కార్యాకలాపాలను నిలిపివేసింది. కరోనా వైరస్ దెబ్బకు హ్యుందాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. అది ప్రపంచంలోని అత్యధికంగా కార్లను ఉత్పత్తి చేసే కార్ల కర్మాగారం. శుక్రవారం దాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి వచ్చే విడి భాగాల ఉత్పత్తిని నిలిపివేయడంతో సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ కాంప్లెక్స్ కి సంభందించి 5 ప్లాంట్లు ఉన్నాయి. ఇది సంవత్సరానికి 1.4 మిలియన్ వాహనాలను తయారు చేయగలదు, తీరప్రాంతంలో ఉండటంతో భాగాలను దిగుమతి చేసుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా కార్లను ఎగుమతి చేయడానికి గాను వీలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థలో సరఫరా మార్గాలు చాలా కీలకం… ఇప్పుడు వాటిని మూసి వేయడంతో చాలా కంపెనీలను మూసివేసారు.

చైనాలోని విడిభాగాల కంపెనీలను దేశ వ్యాప్తంగా మూసి వేసింది అక్కడి ప్రభుత్వం. ఇక ఇప్పుడు కియా కూడా తన కార్ల ఉత్పత్తిని భారీగా ఆపేసింది. దక్షిణ కొరియా వ్యాప్తంగా ఉన్న తన కర్మాగారాల్లో ఉత్పత్తిని క్రమంగా నిలిపివేస్తుంది. 25,000 మంది కార్మికులను బలవంతపు సెలవు ఇచ్చి, పాక్షిక వేతనాలు చెల్లించి పంపిస్తుంది. 500 మిలియన్ డాలర్లు మేర దీని వలన నష్టం వాటిల్లనుంది.

కియా వచ్చే సోమవారం ఒక రోజు మూడు ప్లాంట్లను నిలిపివేస్తుంది. ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ యొక్క దక్షిణ కొరియా యూనిట్ వచ్చే వారం బుసాన్‌లో తన కర్మాగారాన్ని కార్యాకలాపాలను ఆపాలని భావిస్తుంది, అధికారిక గణాంకాల ప్రకారం చైనాలో 31,000 మందికి పైగా సోకింది మరియు 636 మంది మరణించారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news