బ్రేకింగ్: సిఎంలతో మోడీ భేటీ…?

-

కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి వచ్చే వారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ రెడీ అయ్యారు. ఈ సమావేశం సెప్టెంబర్ 23 న జరిగే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలపై దృష్టి సారించి దేశ వ్యాప్తంగా మహమ్మారి పరిస్థితిని సమీక్షించడానికి ప్రధాని క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సిఎంలతో ఆయన చివరి కరోనా సమీక్షా సమావేశం ఆగస్టు 11 న జరిగింది. ముఖ్యమంత్రులతో ఆయన చర్చలు జరిపారు. 10 అత్యంత ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ మరియు ఉత్తర ప్రదేశ్ ల సిఎంలతో భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news