ఈ రోజు కాసేపటి క్రితమే ఢిల్లీ లో సినీ నటి మరియు సహజనటిగా పేరొందిన జయసుధ బీజేపీ లో జాయిన్ అయ్యారు. ఇంతకు ముందు వైసీపీ లో ఉన్న జయసుధ కొంతకాలం అనారోగ్యం కారణాల వలన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ చురుకుగా ఉండాలన్న ఆలోచనతో పార్టీ మారాలని నిర్ణయించుకుని పక్కా ప్లానింగ్ తోనే బీజేపీలోకి వెళ్లడం జరిగింది. కేంద్రంలో తరుణ్ చూజ్ మరియు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ల సమక్షములో జయసుధ బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన అనంతరం జయసుధ మాట్లాడుతూ … దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పధంలో దూకుసుకువెళుతోంది, అందుకే ఆ అభివృద్ధిలో తాను భాగం కావాలని బీజేపీలోకి చేరినట్లు తెలిపింది. గత సంవత్సరం నుండి నేను పార్టీ మారాలని అందులోనూ బీజేపీ లాంటి మంచి విలువలు ఉన్న పార్టీలోకి రావాలని చర్చలు జరుగుతున్నాయి, ఇంతకాలానికి కుదిరిందంటూ జయసుధ ఓపెన్ అయింది.
ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశ్యంతోనే బీజేపీలో చేరాను అంటూ క్లారిటిటీ ఇచ్చింది జయసుధ.