బ్రేకింగ్: ఎమ్మార్వో నాగరాజు బ్యాంకు లాకర్ ఓపెన్, కళ్ళు బైర్లు కమ్మేలా బంగారం

-

కీసర మాజీ తహాసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. బినామీ పేరిట అతను బ్యాంకు లాకర్ తెరిచారు అని అధికారులు గుర్తించారు. బావమరిది నరేంద్ర పేరిట లాకర్ ని ఓపెన్ చేసాడు. తహాసిల్దార్ బ్యాంక్ లాకర్లపై ఆరా తీసిన ఏసీబీ, అల్వాల్ లోని ఓ బ్యాంక్ లాకర్ తెరిచింది. సౌత్ ఇండియా బ్యాంకు లో ఈ లాకర్ ఉంది. కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకుని సీజ్ చేసారు.

లాకర్లోని బంగారం అంతా కూడా సీజ్ చేసారు. జీజే నేరందర్ పేరుతో బ్యాంక్ లాకర్ ఉంది. బినామి పేర్లతో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. 57 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1532 గ్రాముల గోల్డ్ సీజ్ చేసిన ఏసీబీ బంగారం వాచ్ తో సహా పలు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది. నాగరాజు భార్య పరారీలో ఉందని అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news