బ్రేకింగ్: ఇండియా చైనా మధ్య మళ్ళీ చర్చలు

-

భారత్ చైనా సరిహద్దుల్లో వాతావరణం కాస్త కంగారు పెట్టొచ్చు గాని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు సమస్యల పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గం అని చెప్తుంది. ఇప్పుడు మరోసారి ఇండియా చైనా మధ్య వరుసగా చర్చలు జరుగుతున్నాయి. 8 వ రౌండ్ చర్చలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద జరుగుతాయని కేంద్రం పేర్కొంది.

వచ్చే వారంలో ఎప్పుడు అయినా ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈసారి, భారత దళంలో లెహ్నెంట్ జనరల్ పిజికె మీనన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క తూర్పు ఆసియా సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ ఈ చర్చల్లో పాల్గొంటారు. చైనా వైపు, జనరల్ లిన్ లియు మరియు విదేశాంగ శాఖ అధికారి ఉంటారు. సున్నిత ప్రాంతాల నుంచి సైన్యం వెనక్కు తగ్గడంపైనే ఈ చర్చలు జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news