హైదరాబాద్ పై వరుణుడు మరో సారి కన్నెర్ర చేశాడు. నిన్న రాత్రి సిటీలోని అన్ని ప్రాంతాల్లో కుండపోత కురిసింది. దీంతో రహదారులపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. మోకాల్లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని ఏరియాలలో వర్షం బాగా కురవడంతో హైదరాబాద్ లోని ఈ
రోడ్లు మూసివేయబడ్డాయి.
తూర్పు జోన్ లో మలక్‌పేట్ ట్రాఫిక్ పిఎస్ పరిమితులలో 1. మలక్‌పేట రబ్, 2. గడ్డి అన్నారాం – శివ గంగా రోడ్, 3. మూసారం బాగ్ కాజ్‌వే మూసివేయబడింది 4. చాదర్‌ఘాట్ కాజ్‌వే మూసివేయబడింది. ఇక వెస్ట్ సెంట్రల్ జోన్ గోషామహల్ ట్రాఫిక్ పిఎస్ పరిమితులలో పురాణపూల్ 100 అడుగుల రోడ్ మూసివేయబడింది. ఇక టోలిచౌక్ ట్రాఫిక్ పిఎస్ పరిమితులలో టోలిచౌకి ఫ్లై ఓవర్ కింద రోడ్డు మూసివేశారు. దక్షిణ జోన్ లోని ఫలక్నుమా ట్రాఫిక్ పిఎస్ పరిమితులలో 1. మొగల్ కళాశాల, ఫలక్నుమా, అలానే బండ్లగుడ నుండి ఆరాంఘర్ వెళ్ళే రోడ్, అలానే ఎంబిఎన్ఆర్ ఎక్స్ రోడ్ నుండి ఐఎస్ సదన్ రోడ్ వరకు మూసివేశారు.