ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించారు. శాసనమండలి పై అసెంబ్లీలో చర్చించడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే శాసన మండలి రద్దు కు సంబంధించి రేపు అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 9:30 కు జరిగే క్యాబినెట్ భేటీలో మండలి రద్దు తీర్మానాన్ని కేబినెట్లో ఆమోదించి ఆ తర్వాత దాన్ని శాసనసభలో ప్రవేశ పెట్టి అక్కడ కూడా ఆమోదించి కేంద్రానికి బిల్లు పంపాలని జగన్ వ్యూహం. ఇప్పటికే మండలి రద్దు ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ తరుణంలో శాసనసభ సమావేశాలకు పాల్గొనకూడదని నిర్ణయం తీసుకోవటం కీలకంగా మారింది. ఏది ఎలా ఉన్నా తెలుగుదేశం వెళ్లినా వెళ్లకపోయినా సరే ముఖ్యమంత్రి జగన్ రద్దు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం ఖాయం గా కనబడుతుంది. ఇదిలా ఉంటే టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు తెలుగుదేశం ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు.