ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండలి రద్డుకి సిద్దమయ్యారు. ఎలా అయినా సరే శాసన మండలిని రద్దు చెయ్యాలని భావిస్తున్న ఆయన మూడు రోజుల నుంచి న్యాయ, రాజకీయ నిపుణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సాధ్యాసాద్యాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం మండలిని రద్దు చేయడానికి ముహూర్తం ఖరారు చేసారు.
ఈ నేపధ్యంలో సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని కేబినేట్ లో ఆమోదించి శాసన సభలో చర్చ జరిపి.. బిల్లుని ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. ఇక రేపు ఉదయం 9;30 కేబినేట్ భేటీ జరగనుంది. దీంతో ఏపీ శాసన మండలి రద్దుకు కౌంట్‌డౌన్ మొదలయినట్లే కనబడతోంది. కాగా, దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లోనే మండళ్లు ఉన్నాయని.. రోజుకు కోటి రూపాయలు ఖర్చయ్యే మండలి మనలాంటి పేద రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శాసన మండలి అనేది సూచనలు, సలహాలు తీసుకోవడానికి మాత్రమేనన్న సీఎం.. ఇది తప్పనిసరేం కాదన్నారు.