ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ అభ్యర్ధిగా పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను బరిలోకి దింపాలని నిర్ణయించింది టీడీపీ. తాము రాజ్యసభ సీటు గెలిచే అవకాశం లేదని… అయినా అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించామని అన్నారు చంద్రబాబు.
వైసీపీ ఆగడాలను తెలియజేసేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. వాస్తవానికి సభలో సంఖ్యా పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ గెలిచే అవకాశం లేదు. ఒక్క స్థానం కూడా ఆ పార్టీకి వచ్చే అవకాశాలు లేవు. వైసీపీ నాలుగు స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. తమ పార్టీ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్,
మోపిదేవి వెంకటరమణ ఉంటారని వైసీపీ ప్రకటించింది. ఈ నాలుగు స్థానాలు వైసీపీకే వస్తాయి. ఇప్పుడు టీడీపీ ఏ మాత్రం అవకాశ౦ లేకపోయినా సరే రాజ్యసభ ఎన్నికల బరిలో ఆ పార్టీని దింపాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏమైనా ఉంటుందా అనేది అర్ధం కావడం లేదు. అటు వైసీపీ ఎమ్మెల్యే లు టీడీపీకి సహకరించే అవకాశం లేదు. మరి ఎం జరుగుతుందో చూడాలి.