Breaking: రేపు ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల..

-

కరోనా తర్వాత తెలుగు రాష్ట్రాలలో పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.గత రెండు నెలలు రాష్ట్రమంతా పరీక్షల టెన్షన్ తో ఉంది. ఇప్పుడు ఫలితాల టైం వచ్చింది. మొన్నీమధ్య ఏపీ ప్రభుత్వం పది ఫలితాలను విడుదల చేసింది.అయితే ఆ ఫలితాలు ఆశాజనకంగా రాలేదు.ఇప్పుడు ఇంటర్ పరీక్షా ఫలితాలు రాష్ట్ర మంతా ఉత్కంఠగా మారాయి..గత కొద్ది గంటల నుంచి ఓ వార్త చక్కర్లు కొట్టింది.

ఈరోజు ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది..అది ఫేక్ అని ఏపీ ఇంటర్ బోర్డు అధికారులు కొట్టి పడేసారు.ఈ నెల 25 న ఫలితాలను విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో తల్లి తండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రేపు ఉదయం అనగా జూన్ 18 న ఉదయం 9.15 నిమిషాలకు ఏపీ పాలిసెట్ ఫలితాల ను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి విజయవాడలో విడుదల చేయనున్నారు..పాలిటెక్నిక్, డిప్లోమా,కోర్సులో ప్రవేశాల కోసం మే 29 న ఈ పరీక్షలను నిర్వహించారు.పరీక్షలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డును కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చనని అధికారులు తెలిపారు.రిజిస్ట్రేషన్ నెంబర్, బర్త్ డే డేట్ ఆధారంగా ఫలితాలను చూడవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news