లాక్డౌన్ రిలేషన్స్ : బంధాలపై మహమ్మారి కొరడా ఝళిపించిన మహమ్మారి.. ఏమేం మార్చిందంటే,

మహమ్మారి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అప్పటి వరకు అనుకున్నదంతా మహమ్మారి మార్చేసింది. చాలా బంధాల మీద మహమ్మారి దెబ్బ కొట్టింది. అలాగే కొన్ని బంధాలని దగ్గర చేసింది. బంధాల విలువ తెలిసేలా చేసింది. లాక్డౌన్ కారణంగా ఎటూ వెళ్ళకపోవడంతో ఇంట్లో ఉన్న వారితో కొందరికి గొడవలు, మానసిక అశాంతులు ఎక్కువయ్యాయి. అలాగే మరొకొందరికి రిలేషన్ షిప్స్ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. కరోనా ఇబ్బంది పెడుతున్న టైమ్ లో బంధాలు ఎంత బలాన్నిస్తాయో కొందరు తెలుసుకుంటే, మరికొందరు.. బంధాలే మరింత బలహీనంగా మారుస్తున్నాయని తెలుసుకున్నారు.

మహమ్మారి టైమ్ లో చాలామంది తమ బంధాలని తెంచేసుకున్నారు. దానికి కారణంగా అనుకూలంగా లేకపోవడమే అని చెబుతున్నారు. ఇంకా కొందరు వేరు వేరు కారణాలు చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనా వచ్చిన కారణంగా చాలా జంటలు ఒంటరిగా మారాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే, ఒంటరిగా ఇంకా పెళ్ళి చేసుకోని వారుమాత్రం డిఫరెంట్ గా స్పందిస్తున్నారు.

లాక్డౌన్ కారణంగా తమకి కావాల్సిన వాళ్ళని కేవలం ఫోన్లో మాట్లాడడం వాళ్ళకి చిరాకు తెప్పిస్తుంది. భౌతికంగా వాళ్ళ ప్రెసెన్స్ లేకపోవడం ఒంటరితనానికి గురి చేస్తుంది. ఈ విధంగా భౌతికమైన ప్రెసెన్స్ కోరుకుంటున్నారట. లాంగ్ డిస్టేన్స్ రిలేషన్ షిప్స్ వారిని బాగా బాధిస్తున్నాయి. మానసిక సమస్యలు పెరగడానికి ఇదొక మూలకారణంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

నిజానికి మనిషి సంఘజీవి. తోడు లేకుండా బతకలేడు. పెళ్ళి చేసుకున్నా, సహజీవనం అయినా ఏదైనా తోడు కోసమే. ఒంటరిగా ఎంతదూరం నడిచినా తోడుగా నడవడంలో ఉన్న ఆనందం ఒంటరితనం ఇవ్వదు. ఈ విషయాన్ని అనుభవజ్ఞులు నొక్కి చెబుతున్నారు.