కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం కీలక అడుగులు వేస్తున్న సమయంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కీలక ప్రకటన చేసింది. ట్రయల్స్ లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి వివిధ అనారోగ్య సమస్యలు రావడంతో… చివరి దశ హ్యూమన్ ట్రయల్స్ ని నిలిపివేసినట్లు ఆస్ట్రాజెనెకా పిఎల్‌సి మంగళవారం తెలిపింది. తమ కరోనా వ్యాక్సిన్ ప్రామాణిక సమీక్షా విధానం ప్రారంభించబడిందని తెలిపింది.
తమ స్వతంత్ర కమిటీ కరోనా వ్యాక్సిన్ భద్రతను ప్రారంభించడానికి వ్యాక్సిన్ ట్రయల్స్ ని నిలిపివేశామని కంపెనీ ప్రతినిధి మిచెల్ మీక్సెల్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో సదరు వ్యక్తి బాధ పడుతున్నారు అని అందుకే ట్రయల్స్ నిలిపివేశామని చెప్పారు. ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ కు నిధులు సమకూర్చే యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, దీనిపై స్పందించడానికి నిరాకరించింది.