ఆకుకూరల్లో ఒక రకమైన బ్రోకలీలో జుట్టుకు మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మొదలైనవి బ్రోకలీలో పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా జుట్టు పొడిబారకుండా మెరుస్తూ మృదువుగా ఉంటుంది. అయితే జుట్టు ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి బ్రోకలీని ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
నిమ్మరసంతో బ్రోకలీ:
జుట్టు మొదళ్ళ నుండి కొనల వరకు ఆరోగ్యంగా ఉంచేందుకు బ్రోకలీ రసాన్ని తాగవచ్చు. బ్రోకలీని గ్రైండ్ చేసి ఆ రసాన్ని నిమ్మరసంలో కలుపుకుని తాగితే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బ్రోకలీ మాస్క్:
బ్రోకలీతో తయారైన హెయిర్ మాస్క్ పెట్టుకుంటే జుట్టు ఒత్తుగా, మృదువుగా పెరగడమే కాకుండా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. బ్రోకలీ రెబ్బలను తీసుకుని వాటికి రెండు చెంచాల కొబ్బరి నూనెను కలిపి బాగా గ్రైండ్ చేయాలి. మెత్తగా అయినా పేస్ట్ ని జుట్టుకి మర్దన చేయాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు వదిలేసి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
బ్రోకలీ ఆయిల్:
డైలీ జుట్టుకి నూనె పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్లు బ్రోకరి ఆయిల్ ని వాడవచ్చు. ఇది హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. కొన్ని చుక్కల బ్రోకలీ ఆయిల్ ని నెత్తిమీద వేసుకుని మామూలుగా మసాజ్ చేస్తే కుదుళ్ళు బలంగా తయారు కావడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.