ప్రతి ఒకరి జీవితంలో కూడా ఏదో ఒక రోజు కష్టం వస్తూనే ఉంటుంది. అందరి జీవితం కూడా అనుకున్నట్లుగా సాఫీగా జరగదు. ఎన్నో సమస్యలని జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా జీవితంలో ఏ సమస్య ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం ఊహించలేము. సడన్ గా మన జీవితం మారిపోతుంది. ఈరోజు వరకు బాగానే ఉన్నా రేపు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము.
కానీ కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని దాటితేనే జీవితం బాగుంటుంది. ఈ విషయాన్ని మరిచిపోకండి. ప్రసాంగ్ చందోగర్కర్ కూడా జీవితంలో ఎంతగానో ఇబ్బంది పడ్డారు. అయితే ఎన్నడూ జీవితం బాగోలేదని నిరాశ పడలేదు.
వచిక అనే ఒక అమ్మాయిని మాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఆయన చూశారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ కూడా మొదలుపెట్టారు. ఆయన తండ్రి కాబోయే భార్య అయిన వచికకి ఈ పరిస్థితి చెప్పిన తర్వాత ఆమె కావాలంటే ఆయనని వదిలేయవచ్చు కానీ ఆమె ఆయనకి సపోర్ట్ చేసింది క్యాన్సర్ నుండి బయటపడేలా ఆమె అతనితో పాటుగా పోరాటం చేసింది. అతని పక్కనే నిలబడింది.
క్యాన్సర్ కారణంగా 22 కేజీలని తగ్గిపోవాల్సి వచ్చింది. ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాలేదు చాలా సార్లు ఆశలు కూడా వదిలేసుకున్నారు కానీ కాబోయే భార్య తల్లిదండ్రులు ఆయనకి సపోర్ట్ చేసారు. 2022లో క్యాన్సర్ ని జయించారు. వచికాని పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ వలన ప్రేమ వలన ఆయన క్యాన్సర్ ని జయించగలిగానని చెప్పారు. మనసుంటే మార్గం ఉంటుంది అన్న దానికి ఉదాహరణ ఇదేనేమో.
మనం నిజంగా చేయాలనుకుంటే ఏదైనా చేయగలం. చేయలేము అంటే అది అవ్వదు. ఎప్పుడూ కూడా నిరాశ పడకూడదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా సరే వాటిని దాటేయగలమని నమ్మకం పెట్టుకుని ముందుకు వెళితే కచ్చితంగా దాని నుండి బయట పడొచ్చు తిరిగి మళ్లీ మనం హాయిగా జీవించొచ్చు.