అంబర్‌పేట బీఆర్ఎస్‌లో రచ్చ..ఎమ్మెల్యేకు యాంటీ..కిషన్‌రెడ్డికి ఛాన్స్.!

-

తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత పోరు ఉన్న విషయం తెలిసిందే.  నేతల మధ్య ఎక్కడకక్కడ రచ్చ జరుగుతుంది. బహిరంగంగానే నేతలు తిట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో అంబర్‌ పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.. గోల్నాక కార్పొరేటర్ భర్త శ్రీనివాస్‌గౌడ్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. తాజాగా గోల్నాక చౌరస్తా వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి తిరిగి వస్తున్న క్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ భర్త శ్రీనివాస్‌కు ఘర్షణ జరిగింది. ఇరువురూ రోడ్డుపై పరస్పరం దూషించుకున్నారు.

BRS Party Internal Clash

అయితే పూలే విగ్రహానికి పూల మాల వేసే క్రమంలో గోల్నాక కార్పొరేటర్ లావణ్యను ఎమ్మెల్యే నెట్టుకుంటూ వెళ్లారని ఆరోపించారు. అలాగే ప్రతీ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకు, క్యాడెర్‌కు సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే ఒక్కరే కార్యక్రమాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కార్పొరేటర్‌ను నెట్టేశారని కార్పొరేటర్ భర్త శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇక గత కొద్ది కాలంగా అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కానీయకుండా కార్పొరేటర్లను ఎమ్మెల్యే దూరం పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై కొందరు కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా కార్పొరేటర్‌ని పక్కకు నెట్టడంతో రచ్చ మొదలైంది. అయితే గత ఎన్నికల్లో కే‌సి‌ఆర్ గాలిలో కేవలం వెయ్యి ఓట్ల తేడాతో కాలేరు వెంకటేష్..కిషన్ రెడ్డిపై గెలిచారు.

అసలు కిషన్ రెడ్డి కంచుకోటలో కాలేరు గెలవడం సంచలనంగా మారింది. కానీ గెలుపుని ఎక్కువ కాలం నిలుపుకోలేదు..త్వరగానే వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news