శాసనసభలో కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ భారాసా సభ్యులు బయటికి రావడం జరిగింది అనంతరం మీడియా పాయింట్ వద్దకి వెళుతుండగా పోలీసులు మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో బారాసా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ దగ్గరికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
ఉత్తర్వులని చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు సభలో మాట్లాడడానికి మైక్ ఇవ్వడం లేదని మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా అని అడిగారు. బారికేట్లు అడ్డుగా పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. ఈ నిరసన లో కేటీఆర్ హరీష్ రావు జగదీశ్ రెడ్డి కడియం శ్రీహరి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.