కోదాడ కారుకు బ్రేకులు..ఎమ్మెల్యేకు సొంత వాళ్లే చెక్.!

-

ఏపీ-తెలంగాణ బోర్డర్ లో ఉండే స్థానం కోదాడ..రెండు రాష్ట్రాలకు వారథి మాదిరిగా ఉండే ఈ స్థానం…తెలంగాణకు ముఖ ద్వారంగా ఉంటుంది. ఉమ్మడి నల్గొండ పరిధిలో ఉన్న ఈ స్థానంలో ఇటు నల్గొండ, అటు ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సెటిలర్లు ఉంటారు. ఇక్కడ రాజకీయం ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఇక ఉమ్మడి ఏపీలో ఈ స్థానంలో టి‌డి‌పి హవా నడిచేది. తర్వాత కాంగ్రెస్ సత్తా చాటింది.

అయితే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ స్థానంపై గట్టి పట్టు ఉంది. 2014లో ఉత్తమ్ భార్య పద్మావతి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే2018 ఎన్నికల్లో తొలిసారి బి‌ఆర్‌ఎస్ గెలిచింది. కాంగ్రెస్-టి‌డి‌పి పొత్తు పెట్టుకోవడంతో..కాంగ్రెస్ నుంచి పద్మావతి పోటీకి దిగారు. కానీ టి‌డి‌పి నుంచి సీటు ఆశించి భంగపడ్డా బొల్లం మల్లయ్య యాదవ్..చివరి నిమిషంలో బి‌ఆర్ఎస్ లోకి వెళ్ళి సీటు దక్కించుకుని గెలిచారు.

May be an image of 12 people and text that says "నాడు రామరాజ్య స్థాపనకై 2 సీతారాముడు నేడుబంగారు తెలంగాణ నిర్మాణానికై ఈ తారకరాముడు శ్రీ కల్పకుంట్ల తారకరామారావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు KTR శ్రీ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి గారు బి.ఆర్.ఎస్ కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి"

ఇక శశిధర్ రెడ్డి సీటు త్యాగం చేశారు. ఈయన మల్లయ్య విజయం కోసం కృషి చేశారు. అయితే గెలిచాక కొన్ని రోజులు వీరితో సఖ్యతగానే మల్లయ్య..నిదానంగా వీరిని పక్కన పెట్టేశారు. వారి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అటు కీలక నేతలు వేనేపల్లి చందర్ రావు, ఎర్నెని బాబుని సైతం సైడ్ చేశారు. దీంతో ఈ ముగ్గురు నేతలు మల్లయ్యకు యాంటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో మల్లయ్యకు సీటు ఇస్తే సహకరించే పరిస్తితి లేదని శశిధర్ రెడ్డి, చందర్ రావు, ఎర్నేని బాబు అంటున్నారు. తమ ముగ్గురులో ఎవరికి సీటు ఇచ్చిన సహకరిస్తామని, మల్లయ్యకు ఇస్తే సహకరించమని అంటున్నారు.

పైగా నియోజకవర్గంలో కొందరు ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలు శశిధర్ వైపు ఉన్నారు. కోదాడ మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు ఆయన వైపే ఉన్నారు. దీంతో కోదాడ సీటుపై ట్విస్ట్‌లు ఉన్నాయి. ఇక మల్లయ్యకు మళ్ళీ సీటు ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఉంది. అలా కాకుండా వేరే వారికి సీటు ఇస్తే మల్లయ్య సహకరించడం కష్టమే. ఎటు వచ్చిన కోదాడలో కారు పార్టీకి రిస్క్.

Read more RELATED
Recommended to you

Latest news