కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన BRS ఎంపీలు

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో బిజీబిజీగా ఉన్నాయి. ఇంకోవైపు తమ ప్రచారాన్ని షురూ చేశాయి. పాదయాత్రలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా, ఏర్పాట్లపై ఫోకస్ పెట్టాయి.

brs party

తాజాగా బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. కారును పోలిన గుర్తులను వేరే వారికి కేటాయించొద్దని ఈ సందర్భంగా వారు ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి గుర్తుల వల్ల గత ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓట్లు కోల్పోయినట్లు సీఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. గుర్తింపు లేని పార్టీలకు ఇచ్చిన గుర్తుల్లో కారును పోలినవి ఉన్నాయని.. వాటి విషయంలో మరోసారి సమీక్ష చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్​ ఈసీకి విన్నవించారు.

Read more RELATED
Recommended to you

Latest news