కవిత రీఎంట్రీ కోసం అభిమానులు వెయిటింగ్.. పార్టీలో జరుగుతున్న చర్చేంటంటే..?

-

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురుగా.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత.. పదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు.. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.. ఉద్యమ సమయం నుంచి పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చేదాకా.. ఆమె హవానే నడిచింది.. జైలు నుంచి బయటికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.. బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని అందరూ భావించినా.. ఆమె బయటికి రాలేదు..దీంతో ఆమె ఎంట్రీ ఎప్పుడా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది..

తొలిసారి ఎంపీగా గెలిచిన కవిత, తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయినా బీఆర్ఎస్ అధినేత ఆమెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.. దీంతో కల్వకుంట్ల కవిత యాక్టివ్ అవతారని అందరూ భావించారు.. కానీ అలా జరగలేదు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ అధికారులు అరెస్ట్ చెయ్యడంతో.. తీహార్ జైలులో ఆమె కొన్ని నెలల పాటు ఉన్నారు. చివరకు ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆమెకు బెయిల్ లభించింది. బెయిల్ లభించినప్పుడు కూడా బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత తన మద్దతుదారులతో తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన బీజేపీ పై పోరాటం చేస్తానని జైలు బయట ప్రకటించారు.

ఆమె ప్రకటనతో మళ్లీ ఉద్యమాలు మొదలవుతాయని అందరూ భావించారు.. కానీ ఆమె.. రాజకీయ కార్యక్రమాలు ఎక్కడా చెయ్యడంలేదు.. పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.. జైలులో ఉండటం వల్ల కొంత ఆరోగ్యం క్షిణించిందని.. ప్రస్తుతం వైద్యం చేయించుకుంటోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. ఇదే సమయంలో ఆమె వ్యతిరేక వర్గం మాత్రం కవిత రాజకీయాల్లో కొనసాగుతారా? లేదా? అన్న అనుమానం కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రెస్ట్ తీసుకుని ఎన్నికల నాటికి ఆమె రాజకీయంగా యాక్టివ్ అవుతారని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే కవిత ఇంటికే పరిమితమయ్యారని పార్టీలో చర్చ నడుస్తోంది.. మొత్తం మీద కవిత వాయిస్ మాత్రం తెలంగాణలో వినిపించడం లేదు.. ఎప్పుడు బయటికి వచ్చి తన గళం వినిపిస్తారో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news