సీఎం కేసీఆర్ బిగ్ స్కెచ్..కర్ణాటకలో జేడీఎస్ తో కలిసి BRS పోటీ !

-

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మరో చరిత్ర. బీఆర్‌ఎస్‌గా మారింది టీఆర్ఎస్‌ పార్టీ. లాంఛనంగా బీఆర్ఎస్‌ను ప్రారంభించిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ స్థానంలో భారత దేశం మ్యాప్‌, గులాబీ జెండా మధ్యలో భారత్‌ మ్యాప్‌ తో జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్‌.

ఇక అనంతరం, తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం అయింది. మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, జాతీయ రైతు సంఘ నేతలు, పార్టీ కార్యవర్గం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, బీఆర్‌ఎస్‌గా మారిన కేసీఆర్‌ పార్టీ… మే నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికలను తొలి టార్గెట్ గా పెట్టుకుంది. గుల్బర్గా నుంచి బీదర్ వరకు 7 జిల్లాల్లో జేడీఎస్ తో కలిసి పోటీ చేయనుందట బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే, మాజీ సీఎం కుమారస్వామితో కేసీఆర్‌ చర్చలు జరిపారట.

Read more RELATED
Recommended to you

Latest news