వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి వెళ్లిన వాళ్ళను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాలు చెప్పారు. విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని అన్నారు. అలానే తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలని 99 శాతం సమయాన్ని పాలనకే కేసీఆర్ కేటాయించారన్నారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా ఎవరూ కష్టపడలేదన్నారు.
ఇటువంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకొని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్దాం అన్నారు. ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నాం అని అన్నారు కేటీఆర్. ఉద్యమాల వీరగడ్డ ఓరుగల్లు. వరంగల్ జిల్లా లోనూ నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారు అని గుర్తు చేసారు. ఆ ఎలక్షన్స్ ని మరిచిపోయి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం దిశగా పనిచేద్దాం అని చెప్పారు. కార్యకర్తల్లో ఉత్సాహం యధావిధిగా ఉందని, ఈ చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలి అని చెప్పారు. అలానే మనల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదనే విషయం మనం గుర్తుంచుకొని ముందుకు వెళ్దాం అన్నారు.