హైదరాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం..పెళ్లి చూపులైన వెంటనే ప్రైవేట్ టీచర్ మృతి

హైదరాబాద్ మహానగరం లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. షాద్‌నగర్ చౌరస్తా లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ఓ ప్రైవేటు టీచర్ రమేష్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల క్రితం షాద్‌నగర్ చౌరస్తా లో బైక్ పైన వెళుతున్న రమేష్ ఆవును ఢీ కొట్టాడు. ఆవును ఢీ కొట్టడం తో అదుపు తప్పి రోడ్డు పై పడ్డాడు రమేష్.

ఈ ఘటన లో రమేష్ తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు రమేష్. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స అందించారు వైద్యులు. అయితే చికిత్స పొందుతూ రమేష్ ఇవాళ మృతి చెందాడు. మితి మీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఇక గత బుధవారం రమేష్ కు పెళ్లి చూపులు అయ్యాయి. మరీ కొన్ని రోజుల్లో రమేష్ కు వివాహం కానుంది. అయితే నాథలోనే రమేష్ మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.