హెల్త్ అప్డేట్ : సాయి ధరమ్ తేజ్ ఔట్ ఆఫ్ డేంజర్

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్… యాక్సిడెంట్ అయి.. ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితిపై అపోలో ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్ లో స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడినట్లు తెలిపారు వైద్యులు.

ప్రధాన అవయవాలు బాగా పనిచేస్తున్నాయని… ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు వైద్యులు. ఇక ఇవాళ మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని… సాయి ధరంతేజ్ ఆరోగ్యపరిస్థితిపై రేపు మరో ప్రకటన చేస్తామని హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

కాగా హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు మరియు సినీ తారలు వరుసగా సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మాస్ మహారాజ రవితేజ, విజయ్ దేవరకొండ ఇలా హీరోలు మరియు దర్శకులు, నిర్మాతలు సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ట్విట్స్ పెడుతున్నారు.