BSNL BIG OFFER: రూ.49తో ప్రీపెయిడ్ ప్లాన్ ఫెసిలిటీ?

-

కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్, ఐడియా వంటి సంస్థలు పోటీ పడుతున్నరు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.49తో ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్‌ను వాడుకలోకీ తీసుకొచ్చింది. తక్కువ మొబైల్ డాటా వాడే వారి కోసమే ఈ ప్లాన్ తీసుకొచ్చినట్లు బీఎస్ఎన్‌ఎల్ పేర్కొంది.

BSNL-ప్రీపెయిడ్ ప్లాన్
BSNL-ప్రీపెయిడ్ ప్లాన్

గతంలో ఎయిర్‌టెల్, జియో రెండు తమ వినియోగదారులకు రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్ అందించేవి. కానీ ప్రస్తుతం వాటిని హోల్డ్ చేసేశాయి. దీంతో ప్రస్తుతం ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు రూ.49 ప్లాన్‌ను వినియోగించలేదు. తక్కువ ధరకు ప్రీపెయిడ్ ప్లాన్ అందజేసి.. వినియోగదారులను ఆకర్షించాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. అలాగే ఈ ప్లాన్‌లో 3జీ ఇంటర్నెట్ సేవలు కూడా లభిస్తాయి. త్వరలోనే 4జీకి సేవలు మార్చనున్నట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 100 నిమిషాల వాయిస్, 1 జీబీ డాటా, 20 రోజుల వాలిడిటీ కలిగి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news