రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు…ఎప్పుడు ఎవర్ని ప్రజలు ఆదరిస్తారో చెప్పలేం. ఏదో ప్రజల ఆదరణ దక్కి అధికారంలో ఉన్నవారు…ప్రత్యర్ధులని తక్కువ చేసి…తేలిగ్గా తీసుకుంటే వారే రిస్క్ లో పడతారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా…జగన్ ని తెగ ఎగతాళి చేసేవారు..అసలు జగన్ జన్మలో సీఎం అవ్వరని మాట్లాడారు. తీరా 2019 ఎన్నికల్లో ఎగతాళి చేసిన వారే చిత్తుగా ఓడిపోయారు…మెజారిటీ సీట్లతో జగన్ సీఎం అయ్యారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక..చంద్రబాబుని ఎగతాళి చేస్తూనే ఉంది…బాబు పని అయిపోయిందని, టీడీపీ మూసుకోవాల్సిందే అని, బాబు ముసలోడు అయిపోయారని, ఇంకా ఆయన ఇంటికే పరిమితం అవుతారని మాట్లాడుతున్నారు. అటు లోకేష్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఇలా చేయడం వల్ల పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ లని వైసీపీనే పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది.
అలాగే వైసీపీ..పవన్ బలం సైతం పెంచుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రెండుచోట్ల ఓడిపోయిన దగ్గర నుంచి పవన్ ని…వైసీపీ నేతలు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కు పార్టీ నడిపే అర్హత లేదని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని, రెండుచోట్ల ఓడిపోయిన నేత…రోడ్ల గురించి డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని రోజా లాంటి వారు మాట్లాడుతున్నారు. ఇటు కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వారు ఎప్పుడు పవన్ పై సెటైర్లు వేస్తూనే ఉంటున్నారు.
అయితే పవన్ చేసే విమర్శలకు రాజకీయంగా తిప్పికొట్టవచ్చు..కానీ వ్యక్తిగతంగా ఎగతాళి చేయడం వల్ల ఉపయోగం ఉండదు. అసలు పవన్ కు సత్తా లేదని, తేలిగ్గా తీసుకుంటే నష్టం వైసీపీకే. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయనే డిసైడర్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. పవన్ గాని టీడీపీకి సపోర్ట్ ఉంటే….నెక్స్ట్ వైసీపీకి గెలుపు అనేది చాలా కష్టం. కాబట్టి పవన్ ని తక్కువ అంచనా వేయకూడదు.