వరి నాటు వేసిన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన యాత్ర బుధవారం నాటికి కరీంనగర్ జిల్లాలోనీ వీణవంక మండలం మల్లారెడ్డి పల్లికి చేరింది. ఈ సందర్భంగా మల్లారెడ్డిపల్లి మీదుగా వెళుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ పొలాల్లో వరి నాటు వేస్తున్న మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి వరినాట్లు వేశారు.

ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. కనీసం పది నిమిషాలు కూడా వంగి నాటు వేయడం చాలా కష్టంగా ఉందని, కానీ ఈ తల్లులు రోజుకు ఆరు గంటలు కష్టపడితే కేవలం 300 వస్తాయని వ్యాఖ్యానించారు. కానీ దొరలు మాత్రం నడుము వంచకుండానే వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. శ్రామికులకు సంపద రావాలంటే తెలంగాణలో బీఎస్పీ పార్టీని గెలిపించాలని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news