ఆ ఆలయంలో అడుగడునా రహస్యాలే..ఎవ్వరూ కనుక్కోలేకపోయారు..

-

భారత దేశంలో ఎన్నో ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి.. వాటిలో ఎన్నో అద్బుతమైన కట్టడాలు ఉన్నాయి. కొన్ని ప్రముఖ దేవాలయాల లో ఎవ్వరికి అంతు చిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి.అప్పటి వాళ్ళ మేదస్సుకు ఆ రహస్యాలు నిదర్శనాలు అనే చెప్పాలి. ఇకపోతే చెప్పుకొనే ఒక గుడిలో ప్రతిదీ రహస్యం అనే చెప్పాలి..శ్రీ గట్టు మల్లన్న దేవాలయం శాస్త్రానికి అందని కోనేరు రహస్యం..అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో అంతుచిక్కని ఆలయ రహస్యం వరంగల్ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్ల మరియు నారాయణగిరి గ్రామ మధ్యలో ఉన్న శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవాలయం..

ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది.. మూడు కొండల మధ్య ఈ ఆలయం నిర్మితమై ఉంది.కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామి వారు ఎలా ఉంటారో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా స్వామివారు అలానే ఉంటారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు..ఈ ఆలయం కోనేరు చాలా ప్రముఖమైనది.. ప్రతి ఏటా ఇక్కడ మల్లన్న స్వామి చింతాకు మందం పెరుగుతుంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కోనేరు వద్దకు ఎవరైనా చెప్పులు వేసుకుని వచ్చినా, లేదా మాంసాహారం స్వీకరించి వచ్చినా అంతే సంగతులు. ఈ కోనేరు వద్ద ఉన్న తేనేటీగలు వారిపై దాడి చేస్తాయి అని అక్కడి గ్రామస్తులు చెబుతూ ఉంటారు…ఈరోజుల్లో ఇలా కూడా ఉండటం విశేషం..ఇది సైన్స్ కు కూడా అందని మిస్టరీ..

ఎటువంటి రోగాలు ఉన్నా కూడా అక్కడ కోనేరు లో మునిగితే జబ్బులు మాయం అవుతాయని అక్కడ పూర్వీకుల కాలం నుంచి నమ్మకం..ప్రతి ఆదివారం బుధవారం ఈ ఆలయంలో స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు వస్తూ ఉంటారు.హైదరాబాద్ నుండి వరంగల్ కు వచ్చే నేషనల్ హైవే 165 మార్గంలో మడికొండ అనే గ్రామం వస్తుంది. అక్కడి దిగి ఆటోలో మల్లికుదుర్ల అనే గ్రామానికి వెళ్లాలి. అక్కడ నుంచి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. నడుచుకుంటూ అయినా వెళ్లొచ్చు లేదా లోకల్‌ ఆటోలోనైనా వెళ్లొచ్చు…మీరు ఎప్పుడైనా అటుగా వెళితే మాత్రం ఆలయాన్ని సందర్శించి పునీతులు కండి..

Read more RELATED
Recommended to you

Latest news