Budget 2023: రైతులకు కేంద్రం శుభవార్త చెబుతుందా..?

-

నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సాధారణ బడ్జెట్‌ను సబ్మిట్ చేయనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌ సభ ఎన్నికలకు ముందు ప్రస్తుతం ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్. ఈ బడ్జెట్ మీద వ్యాపారవేత్తలు, పన్ను చెల్లింపుదారులు, నిపుణులు తదితరులు వాళ్ళ అంచనాలని నిర్మలా సీతారామన్‌కు పంపుతున్నారు కూడా. ఈ బడ్జెట్ పైన రైతులు కూడా ఆశలు ఎక్కువ పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు 6 వేల రూపాయలుని ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీన్ని ఏటా 8 వేల రూపాయలకు పెంచవచ్చని అంతా అనుకుంటున్నారు. ఈ స్కీమ్ ని కేంద్రం ఫిబ్రవరి 2019లో ప్రారంభించింది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6 వేల రూపాయలు ఇస్తోంది. ఒక్కొక్కరికీ రెండు వేలు చొప్పున మూడు విడతలుగా ఇస్తోంది. ఇప్పటి వరకు 12 వాయిదాలను ప్రభుత్వం ఇచ్చింది. రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ స్కీమ్ లో చేరవచ్చు. 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన వారికి మాత్రమే తొలిగా ఈ స్కీమ్‌ను వర్తింపజేశారు. 2019 జూన్ నుంచి పథకాన్ని రైతులు అందరికీ అందుబాటులో ఉంచారు.

అయితే మీరు కూడా ఈ స్కీమ్ లో చేరాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక ఈ డాక్యుమెంట్స్ కావాలి. వాటి వివరాల లోకి వెళితే.. పక్కా ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, మొబైల్ నెంబర్, పేరు, కేటగిరి, జెండర్ వివరాలు అవసరం అవుతాయి. అదే విధంగా పొలం పట్టా బుక్ కూడా కావాలి. ఈ డాక్యుమెంట్లు ఉంటే ఆన్‌లైన్‌లోనే పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news