స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉన్నవాళ్ళకి బంపర్ ఆఫర్..!

మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఇప్పుడు డెబిట్ కార్డు ఉన్నవాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ని అందించింది స్టేట్ బ్యాంక్. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డు ఉన్నవాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. షాపింగ్ ఎక్కువగా చేసే వాళ్లకి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. స్టేట్‌ బ్యాంకులో అకౌంట్‌ ఉండి, డెబిట్‌ కార్డు ఉపయోగిస్తున్న వారికి లోన్‌ ని ఇవ్వనుంది స్టేట్ బ్యాంక్. షాపింగ్‌ అంటే ఎక్కువ ఇష్టపడే వారికి ఇది సూపర్‌ ఆఫర్‌ ఇది.

మీరు స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు తో ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తే ఆ మొత్తాన్ని సులభమైన వాయిదాల్లోకి మార్చుకునే అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని లక్ష రూపాయల వరకు కూడా వాడచ్చు అని బ్యాంక్ అంది. మీరు ఒక లక్ష రూపాయల షాపింగ్‌ చేశారనుకోండి దానిని ఈఎమ్‌ఐలోకి మార్చుకోవచ్చు.

అలానే ఫెస్టివ్‌ ఆఫర్‌ కింద ప్రాసెసింగ్‌ ఫీజు కూడా మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. అయితే అందరికీ ఈ సదుపాయం ఉండదు. కనుక ముందే మీరు అర్హులో కాదో తెలుసుకోండి. ఎస్‌బీఐ ఖాతాకు రిజిస్టర్ అయి ఉన్న మీ మొబైల్‌ నెంబర్‌ నుంచి 567676 నెంబర్‌కు DCEMI అనే మెసేజ్‌ను చేస్తే తెలుస్తుంది. మీరు అర్హులైతే మంచి లోన్ తీసుకుని డబ్బుల్ని పొందొచ్చు.